తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నేడు, రేపు(ఈ నెల 15, 16) జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాల్లో జరుగనున్న ఈ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పాఠశాల తరగతుల్లో పరీక్ష నిర్వహించడంతో ఆయా విద్యాసంస్థలకు సోమవారం కూడా సెలవు రానుంది. ఈ మేరకు ఆదివారం, సోమవారంతో కలిసి వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు విద్యాసంస్థలు మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తున్నాయి.