Homeహైదరాబాద్latest Newsఇది ప్రజా పాలన కాదు, రేవంత్ మార్కు రాక్షస పాలన.. హరీష్ రావు

ఇది ప్రజా పాలన కాదు, రేవంత్ మార్కు రాక్షస పాలన.. హరీష్ రావు

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీష్ రావు అన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా ?.. అని ప్రశించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?.. ఇది ప్రజా పాలన కాదు, రేవంత్ మార్కు రాక్షస పాలన, కాంగ్రెస్ మార్కు నిరంకుశ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి నిర్బంధ పాలన అంటూ మండిపడ్డారు. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మా ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అరెస్ట్ చేసిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు అన్నారు.

Recent

- Advertisment -spot_img