HomeTelugu Newsప్లే ఆఫ్స్ కి ఆ మూడు జట్లు.. సెకండ్ ప్లేస్ దక్కేదెవరికి?

ప్లే ఆఫ్స్ కి ఆ మూడు జట్లు.. సెకండ్ ప్లేస్ దక్కేదెవరికి?

IPL-2024 సీజన్ లీగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్లేఆఫ్‌కు వెళ్లే మూడు జట్లు ఖరారయ్యాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాతి దశకు చేరుకున్నాయి. మిగిలిన ఒక బెర్త్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య పోరు ఖరారు కానుంది. ఈ మ్యాచ్‌లో CSK గెలిస్తే నెట్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది. అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో 3 స్థానాలు ఖరారయ్యాయి. 19 పాయింట్లతో కేకేఆర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2వ స్థానం ఏ జట్టుకు దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. 3 జట్లు RR, SRH మరియు CSK జట్లు రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నారు . ఎలా అంటే..CSK టీం RCBని ఓడించాలి. అలాగే RR మరియు SRH వారి చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడు CSK కి 2వ స్థానం దక్కుతుంది. అయితే RR టీం KKR పై తప్పనిసరిగా గెలవాలి. అప్పుడు RR కి 2వ స్థానం దక్కుతుంది. అయితే SRH టీం పంజాబ్‌ పై విజయం సాధించాలి. అలాగే RRని KKR ఓడించాలి. అప్పుడు SRH కి 2వ స్థానం దక్కుతుంది. ఇలా ఈ మూడు జట్లకు 2వ స్థానం అందుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఆ రెండో స్థానం ఎవరికీ దక్కిన్చుకుంటారు దక్కించుకుంటారో..?

Recent

- Advertisment -spot_img