Homeహైదరాబాద్latest Newsఆ ఇద్దరు ప్రధానులకు ఎర్రకోట పై జెండా ఎగురవేసే అవకాశం దక్కలేదు.. ఎందుకో తెలుసా..?

ఆ ఇద్దరు ప్రధానులకు ఎర్రకోట పై జెండా ఎగురవేసే అవకాశం దక్కలేదు.. ఎందుకో తెలుసా..?

ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత ప్రధాని ఎర్రకోట లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎర్రకోట లో ఇప్పటివరకు అత్యధికంగా 17 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. అలాగే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు. అయితే దేశంలో ఇద్దరు ప్రధానులు తమ హయాంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయారు. మాజీ ప్రధాని గుల్జారీలాల్ నందా 13రోజుల చొప్పున రెండుసార్లు ప్రధాని అయ్యారు. అలాగే మాజీ ప్రధాని చంద్రశేఖర్ 1990 నవంబర్‌ 10 నుండి 1991 జూన్‌ 21వరకు, 8 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ వీరిద్దరి పాలనా కాలాలలో రాకపోవడంతో వీరికి ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదు.

Recent

- Advertisment -spot_img