Homeహైదరాబాద్latest Newsదుప్పి మాంసం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు

దుప్పి మాంసం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు

ఇదే నిజం, మంథని : రామగుండం మండలం న్యూ మరేడుపాక గ్రామంలో అక్రమంగా దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గోదావరి 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంట మోహన్, బండారు సురేందర్, లోకినే మల్లేష్ అనే ముగ్గురుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసి రూ. 2,25,000/-జరిమానా విధించారు. వన్యప్రాణులను వేటాడటం చట్టరిత్యా నేరమని, ఏడు సంవత్సరాల వరకూ జైలుశిక్ష ఉంటుందని మంథని అటవీ అధికారి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎన్ రమేష్, డిఆర్ఓ మంథని, జి శ్రీనివాస్, బీట్ అధికారి ఉన్నారు.

Recent

- Advertisment -spot_img