Homeహైదరాబాద్latest Newsద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి..ఇద్దరికి గాయాలు

ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి..ఇద్దరికి గాయాలు

ఇదేనిజం, కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఢీకొని ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . స్థానికుల కథనం ప్రకారం.. బెజ్జూర్ మండలంలోని పోతపల్లి- కోర్తగుడా ప్రధాన రహదారిపై బెజ్జూర్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం, బారెగూడెం నుంచి వస్తున్న బైక్ ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నరసింహులు(20), ఆత్రం మహేష్ (26), తొర్రెం వెంగళరావు(30) గా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరిని 108 లో కాగజ్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కౌటల సీ.ఐ షాదిక్ పాషా, బెజ్జూరు ఎస్.ఐ విక్రమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img