Homeసినిమా200 కోట్ల క్లబ్​ వైపు దూసుకెళ్తున్న Tiger​–3

200 కోట్ల క్లబ్​ వైపు దూసుకెళ్తున్న Tiger​–3

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్​టైనర్​ టైగర్–3. దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. సల్మాన్ ఖాన్ కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. గురువారం ఒక్కరోజే రూ.18 కోట్ల వసూళ్లను రాబట్టింది. టైగర్​ ఫ్రాంచైజ్​ సిరీస్​లో భాగంగా వచ్చిన ఈ థర్డ్ పార్ట్​లో సల్మాన్ సరసన కత్రినాకైఫ్​ హీరోయిన్​గా నటించింది. ఇమ్రాన్ హష్మీ విలన్​ రోల్​లో, షారుఖ్​ ఖాన్​ గెస్ట్ రోల్​లో కనిపించాడు. ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పటి వరకూ వరల్డ్​ వైడ్​గా రూ.183 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. తొందరలోనే 200 కోట్ల రూపాయల క్లబ్​లో చేరడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img