Homeసినిమా'Tiger-3' Trailer.. Action Scenes Adurs ‘Tiger–3’ Trailer.. యాక్షన్ సీన్స్ అదుర్స్

‘Tiger-3’ Trailer.. Action Scenes Adurs ‘Tiger–3’ Trailer.. యాక్షన్ సీన్స్ అదుర్స్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్​ ఖాన్ –కత్రినా కైఫ్ కాంబినేషన్​లో టైగర్ సిరీస్​లో భాగంగా వస్తున్న మూడో సినిమా ‘టైగర్–3’. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా యశ్​ రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తున్న ఈ సినిమాకు మనీశ్​ శర్మ దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్​ను మేకర్స్ రిలీజ్ చేశారు. సల్మాన్–కత్రినా జంట మరోసారి యాక్షన్ సీక్వెన్స్​లతో అలరించేందుకు సిద్ధమైనట్లు ట్రైలర్​ను చూస్తే తెలుస్తోంది. సల్మాన్​పై చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్​లు.. కత్రినా చేసిన బాత్​ టవల్ ఫైట్ సీన్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12న ‘టైగర్–3’మూవీ రిలీజ్​ కానుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img