బడికి వెళ్లే ఆరో తరగతి బాలికను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బీరప్ప అదే గ్రామానికి చెందిన 6వ తరగతి బాలికను జూన్ లో పెళ్లి చేసుకున్నాడు. బాలిక స్కూల్‌కు వెళ్లగా పెళ్ళైనట్లు గుర్తించిన ఓ టీచర్ అధికారులకు సమాచారమిచ్చారు. విచారించిన అధికారులు.. బాలికను స్టేట్ హోంకు తరలించారు. యువకుడితో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.