Homeఆంధ్రప్రదేశ్Tirumala Ghat Road : తిరుమలకు ఘాట్ రోడ్ చరిత్ర తెలుసా..

Tirumala Ghat Road : తిరుమలకు ఘాట్ రోడ్ చరిత్ర తెలుసా..

Tirumala Ghat Road : తిరుమలకు ఘాట్ రోడ్ చరిత్ర తెలుసా..

Tirumala Ghat Road : తిరుమల వేంకటేశ్వరుని వైభవం గురించి తెలుసుకున్న అప్పటి మద్రాస్ ప్రభుత్వం కొండమీదకి వెళ్ళడానికి రోడ్డు మార్గం గురించి ఆలోచించింది.

1935 కాలములో మెల్లగా తిరుమలకి వచ్చే భక్తులు మెల్లగా పెరగటం, కానీ తిరుమలకి చేరుకోవాలి అంటే ఏడూ కొండలు ధాటి వెళితే శ్రీనివాసుని దర్శనభాగ్యం కలుగుతుంది.

ప్రజల విన్నపాలని పరిశీలించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం సూచన మేరకు బ్రిటిష్ సర్వే బృందాలు సర్వే చేసి కొండా మీదకి రోడ్డు ప్రతిపాదన చేసారు.

కానీ అసలు కొండా మీదకి రోడ్డుమార్గము సాధ్యమేనా అని ప్రజలు అనుమానించారు.

ప్రముఖ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పర్యవేక్షణలో 1943వ సంవత్సరంలో ఘాట్ రోడ్ పనులు మొదలుపెట్టి 1944 ఏప్రిల్ మాసములో పూర్తిచేశారు.

ఈ ఘాట్‌ రోడ్డును అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్తూర్‌ హోప్‌ అదే నెల ఏప్రిల్ 10 న ప్రారంభించారు.

ఆరోజు నుంచి అలిపిరి నుంచి తిరుమలకి పూర్తిస్థాయిలో ఘాట్ రోడ్ ప్రజలకి అందుబాటులోకి వచ్చింది.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో అలిపిరి నుంచి 36 వంపులు తిరుగుతూ ప్రమాదకరమైన మలుపులతో 19 కి.మీల దూరం రోడ్డు వేశారు. అప్పట్లో ఘాట్ రోడ్ ఒక సంవత్సర కాలంలోనే వేయటం గొప్ప విషయం.

మొదట్లో ఎద్దులబళ్లు, గుర్రపుబళ్లు మీద ప్రజలు తిరుమలకి చేరుకునేవారు. తరువాత ప్రభుత్వం సందర్శకుల కోసం తిరుపతి-తిరుమల రెండు బస్సులు ప్రారంభించింది.

తిరుమల నుంచి రాత్రి ఏడూ దాటితే బస్సులు ఉండేవి కావు. ఈ రెండు బస్సులు తిరుపతిలోని మొదటిసత్రం నుంచి రోజుకు మూడు సర్వీసులు ఉండేవి.

ఆ సమయములో రోజుకి 700 నుంచి 800 మంది రాకపోకలు సాగించేవారు.

నెమ్మదిగా భక్తులు పెరగటంతో బస్సుల సంఖ్య కూడా పెంచుకుంటూ పోవటంతో భక్తులకి తిరుమలకి చేరుకోవటం సులువు అవ్వటంతో భక్తులు వేంకటేశ్వరుని దర్శనానికి వెల్లువెత్తసాగారు.

ముఖ్యముగా భక్తుల అవసరార్థం 1955 – 56 లో శ్రీనివాస బస్టాండ్ ని రైల్వే స్టేషన్ సమీపాన నిర్మించారు.

భక్తుల సంఖ్య రోజు రోజుకి విపరీతముగా పెరగటంతో ఒక ఘాట్ రోడ్డు మీదే తిరుమలకి వెళ్లేవారు, తిరుపతికి దిగివచ్చేవారికి ఇబ్బందిగా మారటంతో రెండో ఘాట్ రోడ్ గురించి ఆలోచించటం జరిగింది.

రెండవ ఘాట్ రోడ్ చరిత్ర

పాత ఘాట్ రోడ్ తిరుమల నుంచి తిరుపతికి, కొత్త ఘాట్ రోడ్డుని తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఉపయోగిస్తున్నారు.

1973లో రెండో ఘాట్ రోడ్డు (తిరుపతి నుంచి తిరుమలకు)ను నిర్మించారు. మొదటి ఘాట్ లో కొండలు చరియలు కూలే అవకాశాలు తక్కువ.

16 కిలోమీటర్లు నిడివిగల రెండో ఘాట్ రోడ్డులో మాత్రం 7వ కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే పరిస్థితులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

భవిషత్తులో భారీ కొండా చరియలు విరిగిపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం టీటీడీ పూనుకుంది.

పరిశీలనలో అన్నమయ్య పురాతన మార్గం ఆరు శతాబ్దాలకు ముందు తాళ్లపాక అన్నమాచార్యులు వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని తాళ్లపాక నుంచి తిరుమలకు వచ్చారని చరిత్ర.

ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గంగా పిలుస్తున్నారు. మామండూరు నుంచి సుమారు 16 కిలోమీటర్లు మధ్యలో కొండలు లేకుండానే తిరుమలకు చేరుకునేలా రోడ్డు ఉంది.

దీన్ని ఆధునీకరించి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మించాలన్న డిమాండ్ కూడా ఉంది.

రెండోఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారడం, అన్నమయ్య మార్గాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ మార్గాన్ని టీటీడీ పరిశీలిస్తోంది.

అవరోధాల మధ్య అన్నమయ్య మార్గం మామండూరు నుంచి తిరుమల పొలిమేరలకు వచ్చే వరకు అటవీ ప్రాంతమంతా రిజర్వు ఫారెస్ట్.

అరుదైన వృక్ష, జంతువులు ఎక్కువగా ఈ శేషాచల పరిధిలోనే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కేంద్రం శ్రీవేంకటేశ్వర అభయారణ్యంగా ప్రకటించి రక్షిస్తోంది.

ఈ చట్టం కింద కట్టెపుల్లను కూడా తొలగించేందుకు నిబంధనలు అంగీకరించవు.

తిరుమల, తిరుపతితో మాత్రమే ముడిపడిన దేవస్థానం తిరుపతి మార్గాన్ని కాదని మామండూరు ప్రాంతానికి కొత్త రోడ్డు మార్గం విస్తరణకు ఇక్కడి స్థానికులు అంగీకరించే పరిస్థితులు తక్కువ.

ఇలాంటి పరిస్థితుల మధ్య పురాతన అన్నమయ్య మార్గం సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నార్థకమే.

అలిపిరి నుంచి కొత్త రోడ్డుకు యోచన 7 నుంచి 16వ కిలోమీటరు వరకు రాళ్లు కూలే అవకాశాలున్న రెండో ఘాట్ రోడ్డు కింద భాగంలోనే కొత్త రోడ్డు నిర్మించే అంశం కూడా పరిశీలనలో ఉంది.

అలిపిరినుంచి వినాయకస్వామి ఆలయం, జూపార్క్ మీదుగా హరిణి దాటుకుని 12వ కిలోమీటరు వరకు కొండల మధ్య కాకుండా నేల మీదే కొత్త రోడ్డు నిర్మించి లింక్ రోడ్డుకు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.

దీనివల్ల కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కూడా టీటీడీ పరిశీలిస్తోంది.

Recent

- Advertisment -spot_img