Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (10-06-2024)

నేటి రాశి ఫలాలు (10-06-2024)

మేష రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనయోగమున్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలుంటాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇంటిలో సంతాన విషయమై వివాహ ప్రస్తావన వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఈరోజు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇంటా బయటా ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. మొండి బకాయిలు వసూలవుతాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగపరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలుంటాయి. ధనూ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగమున్నది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజవుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగములో విధులలో ఆటంకాలు తొలగుతాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారములో చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

Recent

- Advertisment -spot_img