Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (17-06-2024, సోమవారం)

నేటి రాశి ఫలాలు (17-06-2024, సోమవారం)

మేష రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగపరంగా అనుకూల సమయం. వ్యాపారపరంగా లాభదాయకం. వృత్తిపరంగా బాగా కష్టపడతారు. నిరుద్యోగులకు మంచి సంస్థల నుండి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలించును. పిల్లలు చదువుల్లో ముందుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మేష రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం శివపంచాక్షరీ మంత్రంతో శివుణ్ణి అభిషేకించడం, పూజించడం మంచిది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంతానం చదువుల్లో విజయాలు పొందుతారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. జీవిత భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం ఉంటాయి. అధికారుల నుంచి శుభవార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం చంద్రశేఖర అష్టకం పఠించడం మంచిది. శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత లభించును.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. దూర ప్రాంతాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలుంటాయి. వృత్తి వ్యాపారపరంగా అనుకూలం. కుటుంబములో శుభకార్యాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాలయాన్ని దర్శించి పుణ్యనదీ (గంగ, గోదావరి, కృష్ణ కావేరీ) జలాలతో అభిషేకం చేయటం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలు తగ్గించుకుంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిపాటి శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎవరికీ హామీలు వుండవద్దు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కర్కాటక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించండి. బిల్వాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్నేహితుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడులుంటాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడికి తగిన లాభాలుండవు. వ్యక్తి సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా శ్రమ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యనారాయణ మూర్తికి తర్పణాలు వదలండి. లింగాష్టకాన్ని పఠించండి.

కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల అండదండలుంటాయి. సహోద్యోగుల సహకారంతో ముఖ్య బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి బాగా లాభాలు అందుకుంటారు. మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవడం మంచిది. శివపురాణం పఠించండి.

తులా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. శుభవార్తలు వింటారు. ఆనందముగా గడుపుతారు. ఏపని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. అనేక మార్గాల ద్వారా ఆదాయం పొందుతారు. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విలాస జీవితం మీద ఖర్చు పెరుగుతుంది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివాష్టకం పఠించండి. శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, శివారాధన మంచిది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబముతో దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారులు మీమీద ఎక్కువగా ఆధారపడతారు. మీతో అధికారాలను పంచుకునే అవకాశం కూడా ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో కలసివచ్చును. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశముంది. లాభదాయక వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో క్రమంగా నష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివారాధన చేయాలి. బిల్వాష్టకము పఠించటం మంచిది.

మకర రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. కొందరు స్నేహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలసివస్తాయి. అనవసర ఖర్చులు ఇబ్బందిపెట్టును. కుటుంబముతో అనందముగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకావాలుంటాయి. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అప్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల సమయం. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి అయ్యి లాభాలు పొందుతారు. సొంత ప్రయత్నాల వల్ల లాభం చేకూరుతుంది. ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది. కుటుంబపరంగా సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా అధిగమిస్తారు. అదనపు ఆదాయ మార్గాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. కుంభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వాష్టకం పఠించండి. శివారాధన చేయండి.

మీన రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో శమ అధికమగును. బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టం అయ్యే అవకాశముంది. ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రభుత్వ మూలక ధనం అందుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడులుంటాయి. బాధ్యతలు, లక్ష్యాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. పిల్లలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

Recent

- Advertisment -spot_img