Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (29-07-2024, సోమవారం)

నేటి రాశి ఫలాలు (29-07-2024, సోమవారం)

మేష రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రులు, ఆత్మీయుల‌ను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం ల‌భిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. కొత్త పెట్టుబ‌డుల‌కు ఇది అనువైన సమయం. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. ఆహారం విషయంలో సమయపా లన తప్పనిసరి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యారాధన శుభప్రదం.

వృషభ రాశి
వృష‌భ రాశి వారికి అనుకూల స‌మ‌యం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ది పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాప్యం ఉండవచ్చు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి. మంచి జ‌రుగుతుంది.

మిథున రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఆశాజనకంగా లేదు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్న చిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారులు పెట్టుబ‌డుల విష‌యంలో వేచిచూసే ధోరణితో ఉండటం మంచిది. ఓ శుభవార్త వింటారు. పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి
నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండండి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. శ్రమకు తగిన ఫలితం ల‌భిస్తుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

సింహ రాశి
మంచి ఆలోచనలు చేస్తారు. మానసికంగా సంతృప్తిగా గ‌డుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యా ర్థులకు మంచి సమయం. వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు రావొచ్చు. వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పెద్దల అండదండలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కన్యా రాశి
పెద్దల సహకారంతో పనుల్లో కదలిక క‌నిపిస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బులు స‌కాలంలో చేతికి అందకపోవచ్చు. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమయపాలన అవసరం. అదృష్టంతో వ్యవహారాలు చక్కబడతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేపడతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

తులా రాశి
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో వృథా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

వృశ్చిక రాశి
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయా ణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవ కాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభి స్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం.

ధనుస్సు రాశి
కీలక విష‌యాల్లో మంచి నిర్ణ‌యాలు తీసుకుంటారు. వాటిని స‌రిగ్గా అమ‌లు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొవ‌లసి రావచ్చు. కీల‌క విష‌యాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. రాబడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.

మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి రావలసిన డబ్బు స‌కాలంలో చేతికి అందుతుంది. రోజువారి లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కని పిస్తుంది. స్నేహితుల మ‌ధ్య‌ విభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం అవసరం. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కుల‌దేవ‌త‌ను ఆరాధించండి.

కుంభ రాశి
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొం టారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన ఉన్నది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

మీన రాశి
కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఆత్మీయుల సలహాలు పాటించండి. వాహన మర్మతులు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవాటిపై దృష్టి సారించడం అవసరం. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల లబ్ది చేకూరుతుంది. పెద్దల సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి. శుభ ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

Recent

- Advertisment -spot_img