Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (31-05-2024)

నేటి రాశి ఫలాలు (31-05-2024)

మేష రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రుల రాకతో కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో ఈరోజు నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామికి కొన్ని కొత్త బహుమతులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో దూరంగా పంపబడతారు. వృధా ఖర్చులుంటాయి. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం అనుకూలించును. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్షీ అష్టకం పఠించండి.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పలు మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది. బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీరు సాధించిన విజయాల ద్వారా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. దూర దేశాల నుంచి శుభవార్త వింటారు. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. పలువురి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబంతో శాంతి, సౌఖ్యం ఏర్పడుతుంది. ఊహించిన దానికన్నా అధిక ధనలాభం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత ఉండదు. మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అన్నీ సర్దుకుంటాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఖర్చులు ఆదాయానికి మంచి ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. వైద్యుని సంప్రదించాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులతో గొడవలు వచ్చే సూచనలున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచి పెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్పించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

కన్యా రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ప్రతిభతో అందరిని మెప్పిస్తారు. మీ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకునేలా పనిచేయాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. ఆరోగ్యం సామాన్యంగా ఉ టుంది. శ్రీ కృష్ణుడిని పూజించాలి. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లలితా స్తోత్రాన్ని పఠించండి. లక్షీ అష్టోత్తర నామాలను పఠించడం ఆర్థిక సమస్యలు తొలగుతాయి.

తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపెదరు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలుంటాయి. సోదరుల నుంచి కూడా సహాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. సంతానం ద్వారా మంచి గుర్తింపు రాగలదు. కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. మహిళకు కుటుంబ సమస్యలు తీరతాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్షీ అష్టకం పఠించండి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. సోదరులు, బంధువులతో గొడవలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు మానసిక అవేదన. కొంత సొమ్ము చేజారవచ్చు. రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు. మిత్రులు శత్రువులుగా మారే అవకాశముంది. ప్రతి విషయంలోను సహనంగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం అతిథులకు తీపిపదార్థాలు వంటివి పంచిపెట్టండి. ఆలయాలలో మిఠాయిలు వంటివి ప్రసాదంగా సమర్చించండి. పశువులకు బెల్లం, తీపిపదార్థాలను ఆహారంగా పెట్టడం మంచిది.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు చికాకుపరుస్తాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. సంతాన పరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారస్తులకు మధ్యస్థ లాభాలుంటాయి. విస్తరణ ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు అకస్మిక ఐదిలీలుంటాయి. కుటుంబసమస్యలుంటాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీరు తలపెట్టిన పనులు ముందుకు సాగవు. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పఠించండి. పాలు పంచదారతో చేసిన ప్రసాదములను లక్ష్మీదేవికి నివేదించడం మంచిది.

మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కలసిరావు. మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో అందదు. బంధువుల నుంచి సహాయం కోరతారు. కుటుంబ సమస్యలు మరింత పెరుగుతాయి. సోదరులు, సోదరీలతో గొడవలు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందక నిరాశ చెందుతారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులుంటాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అమ్మవారిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించి తీపి పదార్థాలు లేదా మిఠాయిలను నివేదించండి.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆకస్మిక ధనలాభాలుంటాయి. సంతానపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాముల చేరిక అనందాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీ శంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించండి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలముండదు. సంతానపరంగా సమస్యలు, బంధువుల నుంచి ఒత్తిడులుంటాయి. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. వివాదాలకు మరింత దూరంగా ఉండటం మంచిది. సోదరీ, సోదరుల మధ్య వివాదాలుంటాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులుండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు మానసిక ఆందోళన. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీఅష్టకం పఠించండి.

Recent

- Advertisment -spot_img