Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (31-07-2024, బుధవారం)

నేటి రాశి ఫలాలు (31-07-2024, బుధవారం)

మేష రాశి
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. గులాబీ, పసుపు రంగులు ధ‌రించండి. వృథా ఖర్చులకు దూరంగా ఉండండి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. శివపంచాక్షరి మంత్రాన్ని పఠించండి.

వృషభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కీల‌క విష‌యాల్లో మీరు చేసే ఆలోచనలు కలసివస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప‌దోన్న‌తులు సూచితం. కళాకారులకు విశేష ఆదరణ ల‌భిస్తుంది. వ్యయ ప్రయాసలున్నాయి. బంధువుల‌తో త‌గాదాల‌కు దూరంగా ఉండండి . పసుపు, లేత ఆకుపచ్చ రంగులు ధ‌రించండి. అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంత తీరతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు క‌లిసివ‌స్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. గులాబీ, తెలుపు రంగులు ధ‌రించండి. ధనవ్యయం ఉంది. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటక రాశి
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడ‌తారు. పాతబాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు క‌లిసి వ‌స్తాయి. గులాబీ, తెలుపు రంగులు క‌లిసి వ‌స్తాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహ రాశి
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. ఆశయాల సాధనలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు ల‌భిస్తాయి. సోదరులతో కలహాలకు దూరంగా ఉండండి. ఎరుపు, లేత గులాబీ రంగులు ఆశాజ‌న‌క ఫ‌లితాలనిస్తాయి. అంగారక స్తోత్రం పఠించండి.

కన్యా రాశి
ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు మంచి ఫ‌లితాల‌ను ఇస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తులా రాశి
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అద‌న‌పు ఖ‌ర్చుల వ‌ల్ల‌ ధననష్టం ఏర్ప‌డ‌వ‌చ్చు . కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుధ్యానం చేయండి. మంచి ఫ‌లితాలు పొందుతారు.

వృశ్చిక రాశి
ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆలోచనల అమలులో ప్రతిబంధకాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థుల శ్రమ వృథా కానుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. నలుపు, నీలం రంగులు మంచి ఫ‌లితాల‌ను ఇస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో అనుకూలస్థితి, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు ధ‌రించండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకర రాశి
అదనపు రాబడి ఉంటుంది. అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం సూచితం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఖర్చులు అధికంగా ఉంటాయి. శ్రమాధిక్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఉత్త‌మ ఫ‌లితాలు ద‌క్కుతాయి. మిత్రులతో విభేదాలు ఉండొచ్చు. పసుపు, లేతనీలం రంగులు ధ‌రించండి. శ్రీరామనామాలు స్మరించండి.

కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించే వరకు విశ్రమించరు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆస్తుల తగాదాలు ఉన్నాయి. నీలం, నేరేడు రంగుల దుస్తులు ధ‌రించండి. దేవీఖడ్గమాల పఠించండి.

మీన రాశి
ఎంతటి పనైనా వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. నీలం రంగు దుస్తులు ధ‌రించండి. దత్తాత్రేయ పూజలు చేయండి. స‌త్ఫ‌లితాలు పొందుతారు.

Recent

- Advertisment -spot_img