Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (10-08-2024, శనివారం)

నేటి రాశి ఫలాలు (10-08-2024, శనివారం)

మేషం
మేష‌ రాశి వారికి స‌మ‌యం అంత అనుకూలంగా లేదు. ప‌రిస్థితులు కాస్త ఇబ్బందిక‌రంగా సాగుతున్నాయి. కీల‌క విష‌యాల్లో చాకచక్యంగా అడుగులు వేయండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. కుటుంబ‌స‌భ్యులతో అన్ని విషయాలు తెలియజేయండి. గృహమార్పు కలిసి వస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

వృషభం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపు తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆరోగ్యం సంతృప్తి కరం. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం
ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహ పడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజ పరుస్తుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.

సింహం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త.

కన్య
ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. విమర్శలు పట్టించుకోవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

తుల
సర్వత్రా అనుకూలమే. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రణాళికా బద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. అయినవారితో సంభాషిస్తారు. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు.

వృశ్చికం
ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.

ధనుస్సు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధన లాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. పెట్టుబడులకు తరుణం కాదు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభా షిస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. వాహనం ఇతరులకివ్వద్దు.

మకరం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. ఆచితూచి వ్యవహరించాలి. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.

కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మీనం
ఈ రాశివారికి ప‌రిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు చేరువవుతారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. రుణ విముక్తులవుతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. పత్రాలు అందుతాయి. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ప్రియతములతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది.

Recent

- Advertisment -spot_img