Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (12-08-2024, సోమవారం)

నేటి రాశి ఫలాలు (12-08-2024, సోమవారం)

మేషం
సంపాదన పెరుగుతుంది. స్త్రీమూలక ధనం లభిస్తుంది. శుభకార్యనిర్వహణ జరుగు తుంది. ఆ సమయంలో గత అనుభవాలను పునః పరిశీలించుకుని ముందడుగు వేస్తారు. కీలక విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. శివారాధన మంచి ఫలితాలు అందిస్తుంది.

వృషభం
సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, ధనాగమం, ధైర్యంతో కార్యభారాన్ని నిర్వర్తించడం, ఉద్యోగంలో పదోన్నతి అవకాశం. విద్యార్థులకు ఉన్నతవిద్యలు కలసివస్తాయి. నూతనగృహం, వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. అంతా మంచే జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించి మానసిక ప్రశాంతత చెడగొట్టుకోవద్దు.

మిథునం
నాలుక అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పదోన్నతులు సూచితం. జీతం పెరుగుతుంది. ఇది పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం, సంపద పెరుగుదల కాలం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అమ్మవారి దేవాలయాన్ని సంప్రదించండి.

కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు శత్రువుల విషయంలో అప్రమత్తత అవసరం. చెడు సహవాసాలు వదిలివేస్తే, శుభ ఫలితాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం, మరిన్ని ఆదాయ అవకాశాలు కల్గుతాయి. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. వినాయక దేవాలయానికి వెళ్ళి స్వామిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.

సింహం
విద్యలో విజయం సాధిస్తారు, వివాహ అవకాశాలు ఉన్నాయి. వినోదంగా గడుపుతారు. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. చెడు సావాసాల వల్ల తిరోగమనావకాశాలుంటాయి. ప్రయాణాలు వాయిదావేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.

కన్య
దొంగతనానికి గురికాకుండా అప్రమత్తత అవసరం. అధిక ఆదాయాన్ని పొందుతారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. విదేశీ పర్యటనలో అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. డబ్బు వృధా అవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. శ్రీ వేంకటేశ్వర స్వామి నామాలు పాటించండి.

తుల
ఏకాదశస్థానంలో రవి, బుధ, శుక్రులు అత్యంత యోగప్రదులు అవుతారు . ఈ సమయంలో కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందంజ వేస్తారు. అనేక రకాలుగా ఆర్థికవృద్ధి, రుణవిమోచన కలుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.

వృశ్చికం
వృత్తి, వ్యాపారం అనుకూలంగా ఉంది. చదువులో పురోగతి సాధిస్తారు . జ్ఞానం వృద్ధి చెందుతుంది. అనేకవిధాలుగా ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఇతరులతో వాదనలు వద్దు. తక్కువ మాట్లాడడం మంచిది. లలిత సహస్ర నామాలు జపించండి.

ధనుస్సు
భౌతికపరమైన సుఖాలు అనుభవిస్తారు. అన్నిరకాల రుగ్మతల నుండి బయటపడతారు. భూమిని కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం గాని లేక కొనుగోలు చేయటానికి చాలా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అంతా శుభ ఫలితాలే ఉన్నాయి. ఇష్ట దేవత ఆరాధన చేయండి.

మకరం
విజయం వరిస్తుంది. న్యాయవాదులు అమోఘమైన వాగ్ధాటి వల్ల ఇతరులను కష్టం నుంచి బయట పడేస్తారు. సాంఘికంగా గౌరవ ప్రదమైన స్థానంలో పురోగమనం సాధిస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. అమ్మవారి ధ్యానం చేయండి. శుభ ఫలితాలు ఉన్నాయి.

కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అందరూ ఆరోగ్యంగా ఉండి జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల ఆనందాన్ని చూస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి.

మీనం
జ్ఞానం వృద్ధి చేసుకుంటారు. ఈ విషయంలో అనేక రకాలుగా ప్రయోజనం పొందు తారు. అన్ని వృత్తులవారికి ప్రోత్సాహకరమైన వాతావరణం, పురోగతి ఉంటుంది. చదువులో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. శివారాధన చేయండి.

Recent

- Advertisment -spot_img