Homeహైదరాబాద్latest NewsIND vs SL: నేడు శ్రీలంకతో తొలి వన్డే.. ఆ స్టార్ ప్లేయర్ పై వేటు.....

IND vs SL: నేడు శ్రీలంకతో తొలి వన్డే.. ఆ స్టార్ ప్లేయర్ పై వేటు.. తుది జట్టు ఇదే!

శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు కొలంబో వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుందని, ఈ వన్డే సిరీస్‌ను సద్వినియోగం చేసుకుని జట్టు కూర్పుపై అంచనా వేయాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది. ప్రధానంగా రిషబ్ పంత్ వన్డే ఫార్మాట్‌లోకి తిరిగి రావడం జట్టుపై ప్రభావం చూపనుంది. పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లలో ఇద్దరికి మాత్రమే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయాలనేది ఇప్పుడు అసలు ప్రశ్న.. అయితే ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ‘‘నేను ప్రధాన కోచ్‌ గౌతమ్ గంభీర్‌తో జట్టు కూర్పుపై చర్చించాల్సి ఉంది. ఎవరిని ఎంచుకోవాలి, వదిలేయాలి అని మీరు ఎక్కువగా చర్చిస్తున్నప్పుడు, జట్టులో నాణ్యత ఉందని అర్థం. ఇది మంచి విషయం అని నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
శ్రీలంకతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/రిషభ్ పంత్, రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

Recent

- Advertisment -spot_img