Homeహైదరాబాద్latest Newsనేడే వరలక్ష్మీ వ్రతం.. లక్ష్మీదేవీ పూజ ఎలా చేయాలి.. ప్రాముఖ్యత ఏంటి..? ఇవాళ అస్సలు చేయకూడని...

నేడే వరలక్ష్మీ వ్రతం.. లక్ష్మీదేవీ పూజ ఎలా చేయాలి.. ప్రాముఖ్యత ఏంటి..? ఇవాళ అస్సలు చేయకూడని పనులు ఏంటో మీకు తెలుసా..?

తెలుగు రాష్ట్రాల మహిళలందరూ ఇవాళ వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి.

వరలక్ష్మీ వ్రతం.. చరిత్ర
దుష్టసంకల్పాలు, దుర్గుణాలు లేని ఇల్లాలు చారుమతి. ఆమె భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేపిస్తూ.. మంచి ప్రవర్తనతో మెలిగేది. ఆమె కలలో శ్రీమహాలక్ష్మీ కనిపించి.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియజేసింది. ఆ శుభదినం రోజున చారుమతి ఇంట్లో..చాలా మంది మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. వాయనాలను ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. దీంతో శ్రీ వరలక్ష్మీ అనుగ్రహం పొందారు.

లక్ష్మీదేవీ పూజ.. ప్రాముఖ్యత
లక్ష్మీదేవీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు.. భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థిస్తారు. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేయాలి. మనలో అంతర్గతంగా ఉండే దైవిక శక్తులను చైతన్యపరిచేది పరాశక్తికి ప్రతిరూపమైన శ్రీమహాలక్ష్మి అంటారు పెద్దలు. ఆమె ఆరాధనే వరలక్ష్మీ వ్రతం.

వరలక్ష్మీ వ్రతం నాడు చేయకూడని పనులు..
వరలక్ష్మీ వ్రతం చేసే వారు కొన్ని నియమనిబంధనలను పాటించాలి. అవి ఏమిటంటే..

  • ఎట్టిపరిస్థితుల్లోనూ మాంసాహారాలను తినకూడదు.
  • ముందు రోజు నుంచే తినకుండా ఉండడం మేలు.
  • ఇతరులను దురుద్దేశంతో ఆరోపణలు చేయకూడదు. ఆ రోజు మొత్తం మంచి మనసుతో ఆలోచించాలి.
  • ఇతరుల చెడు కోరుకోవద్దు.
  • భార్యభర్తలు శారీరకంగా కలవకూడదు.
    వరలక్ష్మి వ్రతం నాడు ఈ నియమాలు పాటిస్తే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తుందని పండితులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img