Homeహైదరాబాద్latest Newsనేడు ప్రపంచ 'ప్లాస్టిక్ సర్జరీ' దినోత్సవం.. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి? ప్లాస్టిక్ సర్జరీలో 'ప్లాస్టిక్‌'...

నేడు ప్రపంచ ‘ప్లాస్టిక్ సర్జరీ’ దినోత్సవం.. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి? ప్లాస్టిక్ సర్జరీలో ‘ప్లాస్టిక్‌’ వాడతారా?

నేడు జులై 15 ప్రపంచ ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం. ‘ప్లాస్టిక్ సర్జరీ’ అనే పదాన్ని మొదటిసారిగా 1837లో ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఉపయోగించారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శరీర భాగాలని కావలసిన రీతిలో మార్చుకోవచ్చు. అయితే ఇటీవల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వారిలో స్త్రీలతో పాటు పురుషులు కూడా ఎక్కువే ఉన్నారు.

‘ప్లాస్టిక్ సర్జరీ’ అంటే ఏమిటి?
ప్లాస్టిక్ సర్జరీ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఇన్ఫెక్షన్, పుట్టుకతో వచ్చే లోపం, గాయం లేదా ప్రమాదం కారణంగా దెబ్బతిన్న శరీర భాగాలకు చికిత్స చేయడం. ఇది వివిధ వైద్య పద్ధతుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలపై జరుగుతుంది. ముఖం, శరీర లోపాలను పునర్నిర్మించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ప్లాస్టిక్ సర్జరీలో రొమ్ము పునర్నిర్మాణం, కాలిన గాయాలు, హ్యాండ్ సర్జరీ, శాశ్వత మచ్చలను తొలగించే శస్త్రచికిత్సలు ఉంటాయి.

ప్లాస్టిక్ సర్జరీలో ‘ప్లాస్టిక్‌’ వాడతారా?
బ్రెస్ట్ ఇంప్లాంట్ అనే సర్జరీలో ప్లాస్టిక్‌ వాడుతారు. కానీ అన్ని సర్జీరీలలో ప్లాస్టిక్ వాడరు. అయితే ఈ ఒక్క సర్జరీ వల్ల అందరూ దీనిని ప్లాస్టిక్ సర్జరీ అని పిలుస్తున్నారు. బ్రెస్ట్ ఇంప్లాంట్లను సిలికాన్ షెల్స్‌తో తయారు చేస్తారు. ఇవి సిలికాన్ జెల్‌తో నిండి ఉంటాయి. కానీ సిలికాన్ కూడా ఒక రకమైన ప్లాస్టిక్. రబ్బరు, ప్లాస్టిక్ కలపడం ద్వారా సిలికాన్ తయారు చేస్తారు.

కేజీహెచ్‌లో ఏటా 1200 మందికి ఉచితంగా ప్లాస్టిక్‌ సర్జరీ శస్త్రచికిత్సలు
గ్రహణం మొర్రి కారణంగా పెదవి చీలడం, చీలిన అంగిలి కారణంగా మాటలు సరిగా రాకపోవడం, ప్రమాదాల్లో దవడ, ముక్కు ఎముకలు విరగడం.. వంటి అవకరాలు పిల్లలు, పెద్దలను బాగా ఇబ్బంది పెడతాయి. నలుగురిలో కలవడానికి కూడా బాధితులు జంకుతుంటారు. అలాంటి వారికి కొత్త జీవితాలను ప్రసాదిస్తోంది విశాఖపట్నంలోని కేజీహెచ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం. ఇక్కడ ఏటా 1200 మందికిపైగా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ సాంత్వన చేకూరుస్తున్నారు.

Recent

- Advertisment -spot_img