Homeహైదరాబాద్latest Newsనేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రతి సంవత్సరం మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు, పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించటానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1993లో మే-3 వ తేదీ నుంచి మీడియా స్వేచ్ఛ గురించి చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధత‌ను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈరోజు గుర్తు చేస్తుంది.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం చరిత్ర
ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్‌ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీ వరకు నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు. వారి నిరసనకు గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది.

‘జర్నలిజం’ ప్రజాస్వామ్యంలో నాల్గవ మూలస్తంభం
ప్రజాస్వామ్యంలో నాల్గవ మూలస్తంభంగా జర్నలిజాన్ని పరిగణిస్తారు. ఇది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిష్పాక్షికమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. అందుకే మే 3వ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19లో భారతీయులకు ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛ వలన ఇప్పుడు ప్రతికలు స్వాతంత్య్రంగా అన్ని వార్తలు రాయగలుగుతున్నాయి.

సంక్షోభంలో భారతదేశ పత్రికా స్వేచ్ఛ
ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో, పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లడానికి ప్రజాస్వామ్యం అంతే అవసరం. పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛ హరించడమే. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌ పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ సూచి-2024లో భారత్ 180 దేశాలలో 159వ స్థానానికి పరిమితం కావడమే దీనికి నిదర్శనం.

భారతదేశంలో పత్రికల పాత్ర
స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజలను చైతన్య పరుస్తున్న ముఖ్య సాధనాలు పత్రికలు. రాజ్యాంగంలోని అధికరణ19A(1) ప్రకారం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను పేర్కొంటారు. పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి నవంబర్16,1966లో ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటు చేశారు. దీనిని 1978లో చట్టంగా మార్చారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975-77 నాటి ఎమర్జెన్సీ పత్రికాస్వేచ్చకు చీకటి రోజులుగా పేర్కొంటారు.

Recent

- Advertisment -spot_img