Homeహైదరాబాద్latest Newsనేడే ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం

నేడే ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం

ఇదే నిజం, గూడూరు: వైద్య పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో, సూపరింటెడెంట్ డాక్టర్ వీరన్న నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సికిల్ సెల్ అనీమియాను నిర్మించటానికి, నేషనల్ సిక్కిం సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ ను స్థాపించి ఎంతగానో కృషి చేస్తున్నాయి. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ కార్యక్రమం కొనసాగుతున్నాయి. సికిల్ సెల్ వ్యాధి లేదా సికిల్ సెల్ అనీమీయా అనేది ఒక వంశాను రక్త రుగ్మత సాధారణంగా మనిషి రక్తం లోని ఎర్ర రక్త కణాలు గుండ్రని ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ అవయవాలకు ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంటాయి. అయితే కొంతమందిలో జున్యు సంబంధ మార్పుల వల్ల, ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో మార్పు చెందుతాయి.

ఈ సికిల్ సెల్ ఉన్నవు వారి రక్త కణంలోని ఒక జన్యు సికిల్ సెల్ గాను, ఒకటి మామూలుగాను ఉన్నట్లయితే అటువంటి వారిని సితింగ్ సెల్ క్యారియర్లు అంటారు. వీళ్ళకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతుల ఇద్దరికీ ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులు వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోని సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే, సికిల్ సెల్ రక్తకణాల జీవితకాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. సికిల్ రక్త కణాలు నశించిపోయేంత వేగంగా కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురి అవుతారు. అంతేగాక సికిల్ రక్తకణాలు వంపు తిరిగి ఉండడం వల్ల, సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేక, శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. అందువలన ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే, తీవ్రమైన సమస్యలతో బాధపడవలసి వస్తుంది. జన్యుపరమైన మార్పులు వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు సరైన మందులు లేవు. సికిల్ సెల్ వ్యాధి యొక్క లక్షణాలు సాధారణంగా 6 నెలల వయసులో ప్రారంభమవుతాయి

అవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. అవి కాలక్రమేణా మారవచ్చు. 1.రక్తహీనత, దీర్ఘకాల కామెర్లు ఉండటం. 2. కీళ్ల దగ్గర,ఛాతి దగ్గర, నడుము వద్ద తీవ్రమైన నొప్పులు ఉండటం. 3. చేతులు, కాళ్ళ వాపులు. 4. ఇన్స్పెక్షన్ తరచుగా సంభవిస్తాయి.5. యుక్త వయసు లేదా పెరుగుదలలో జాప్యం. 6.దృష్టి సమస్యలు. ఈ వ్యాధి నియంత్రణకు నీటిని పుష్కలంగా త్రాగాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ కు మేలు చేసే పండ్లను తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ వ్యాధి ఉన్నవారు, పొగ తాగటం, తీవ్రమైన వేడి, చల్లని ఉష్ణోగ్రతలు బయటికి వెళ్లడం. మీ లక్షణాలు మరింత దిగజారిపోయే వరకు వేసి ఉండటం. రెగ్యులర్ చెకప్, డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకోకపోవడం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు భీంసాగర్, ఎడ్ల రమేష్, భరత్ రెడ్డి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, గూడూరు మండల ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img