Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (27-04-2024)

నేటి రాశి ఫలాలు (27-04-2024)

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. మీ ప్రయత్నాలకు సన్నిహితుల నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ప్రయాణాలలో మెళకువ అవసరం. బంగారు, వెండి, వస్త్ర, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. రావలసిన ధనం వాయిదాపడడంతో ఆందోళన చెందుతారు. విద్యార్థులకు తోటివారి వల్ల సమస్యలను ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఉద్యోగస్తుల అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెళకువ అవసరం. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ లక్ష్య సాధనకు నిరంతరం కృషి పట్టుదల అవసరమని గమనించండి. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెళకువ వహించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చేయాలనుకున్న పనులు వాయిదా వేస్తారు. ప్రింటింగ్‌ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి లాభదాయకం. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురి కావలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. ప్రింటింగ్‌ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావలసిన ధనం అందడంతో మీలో పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల బదిలీలు ఆందోళన కలిగిస్తుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణాలు, మరమ్మత్తులు జరుగుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి
తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలను లోనవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి, చికాకులు తప్పవు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పాతమిత్రుల నుండి ఆహ్వానాలు, లేఖలు అందుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు మరింత బలపడతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. అవకాశవాదులు అధికం కావడం వల్ల ఊహించని ఒత్తిడికి లోనవుతారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారపరంగా అనుకూల సమయం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరీ సోదరుల మధ్య సమస్యలు తలెత్తుతాయి. పత్రిక, మార్కెట్‌ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కొంటారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వచ్చిన సొమ్మును పొదుపు పథకాలవైపు మళ్ళించండి. రావలసిన ధనం చేతికందుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంది ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నమ్మకం, పట్టుదలతో ప్రయత్నాలు సాధించండి. సత్ఫలితాలను పొందుతారు. కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. స్త్రీలు వాక్‌ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. దూర ప్రయాణాల్లో వస్తువులు జారవిడుచుకునే అకాశం ఉంది. జాగ్రత్త వహించండి. హోటల్‌, కేటరింగ్‌ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Recent

- Advertisment -spot_img