Homeహైదరాబాద్latest NewsTollywood : ప్రభాస్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Tollywood : ప్రభాస్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

సినిమాలకు సంబంధించి రేటింగ్స్‌ ఇచ్చే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ అత్యధికమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ టాప్‌లో నిలిచింది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొణె, అమితాబ్‌, కమల్‌హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీని తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘హీరా మండి: ది డైమండ్‌ బజార్‌’ నిలిచింది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదాషేక్‌, షర్మిన్‌ సెగల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సిరీస్‌పై అంచనాలు పెంచుతున్నాయి. ఇక టాప్‌-3లో తమిళ కామెడీ హారర్‌ థిల్లర్‌ ‘అరణ్మణై4’ ఉండటం గమనార్హం. సుందర్‌. సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా నటిస్తున్నారు. తెలుగులో ‘బాక్‌’ పేరుతో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది.

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాప్‌-10 చిత్రాలు

కల్కి 2898 ఏడీ
హీరా మండి: ది డైమండ్‌ బజార్‌
అరణ్మణై 4
శ్రీకాంత్‌
తంగలాన్‌
నడిగర్‌
మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహీ
టర్బో
గురువయ్యూర్‌ అంబల నాయిదల్‌
మలయాళీ ఫ్రమ్‌ ఇండియా

Recent

- Advertisment -spot_img