భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తరవాత ముగియనున్న సంగతి తెలిసిందే. కానీ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత, బీసీసీఐ ప్రధాన కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి టాలీవుడ్ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. తన దరఖాస్తును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే బీసీసీఐ ఆ దరఖాస్తును తిరస్కరించిందని ఆయన చెప్పాడు. కానీ ఈ అప్లికేషన్ నింపడం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.