HomeసినిమాTollywood News : చంద్రమోహన్​ ఇక లేరు

Tollywood News : చంద్రమోహన్​ ఇక లేరు

– అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
– 175 పైగా చిత్రాల్లో నటించిన చంద్రమోహన్
– రంగుల రాట్నం మూవీతో తెరంగేట్రం
– ‘సిరి సిరి మువ్వ‘తో ప్రాచుర్యం
– హీరోయిన్ల లక్కీ హీరో

ఇదేనిజం, హైదరాబాద్: సీనియర్​ నటుడు చంద్రమోహన్​(82) ఇకలేరు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్​ రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించారు. ఆయన కథానాయకుడిగా 175 పైగా చిత్రాల్లో నటించారు. ఇక మొత్తం 932 సినిమాల్లో నటించారు. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ గా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కామెడీ హీరోగానే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుపరిచిత స్థానం సంపాదించుకున్నారు. ఆయనతో నటించిన హీరోయిన్లు అందరూ టాప్​ టాప్​ హీరోయిన్లుగా ఎదిగిరారు. 1966లో రంగుల రాట్నం మూవీతో ఆయన సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆయనతో సిరిసిరమువ్వ మూవీలో నటించిన జయప్రద, పదహారేళ్ల వయసు మూవీలో నటించి శ్రీదేవి తర్వాత టాప్​ హీరోయిన్​గా ఎదిగారు. కొత్త హీరోయిన్లు చంద్రమోహన్ ను లక్కీ హీరోగా చెప్పుకుంటూ ఉంటారు. ఆయన అగ్రికల్చర్​ బీఎస్సీ పూర్తి చేసి ఆ తర్వాత సినిమాల్లో రాణించారు. చంద్రమోహన్ నటించిన సుఖదుఃఖాలు, పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి హిట్ కొట్టాయి. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి చంద్రమోహన్​ తో నటించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img