HomeసినిమాTollywood News : భారీ బడ్జెట్​తో ‘మంగళవారం’

Tollywood News : భారీ బడ్జెట్​తో ‘మంగళవారం’

ప్రస్తుతం టాలీవుడ్​లో మంచి బజ్​ను సొంతం చేసుకున్న థ్రిల్లర్ ‘మంగళవారం’. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ రాజ్​పుత్, అజయ్​ భూపతి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ సైతం ఓ రేంజ్​లో హైప్​ను పెంచుతూ ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లను సాలిడ్​గా చేస్తున్నారు. సినిమా బడ్జెట్​పై దర్శకుడు అజయ్​భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రూ.20 కోట్లతో ఈ సినిమా తీసినట్లు తెలిపాడు. రీసెంట్ టైమ్స్​లో ఈ తరహా సినిమాల్లో ఎక్కువ బడ్జెట్​తో వస్తున్న సినిమా ఇదే అని చెప్పాలి. ఈ నెల 17న గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నందితా శ్వేత, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా నుంచి తాజాగా సంబంధించి ‘అప్పడప్పడ తాండ్ర’లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫోక్​ సాంగ్​కు ఆడియెన్స్​ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ కంపోజ్ చేసిన ఈ పాటకి గణేష్ లిరిక్స్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

Recent

- Advertisment -spot_img