కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తుల బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించడానికి స్థలం గుర్తించి వాటికి అయ్యే ఖర్చు వ్యయాలను ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు.