ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని చింతామణి చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారిందని పట్టణవాసులు వాపోతున్నారు. సాయంత్రం వేళ ఎవరైనా వాకింగ్ చేయడానికి వెళ్తే మందు బాబులు సీసాలు చేతిలో పట్టుకొని బెదిరిస్తున్నారని పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపైన పోలీసులు నిఘా పెడితే బాగుండునని కోరుకుంటున్నారు.