Homeహైదరాబాద్latest Newsజార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. 64.86 పోలింగ్ నమోదు

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. 64.86 పోలింగ్ నమోదు

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సాయంత్రం 5 గంటల వరకు 64.86 శాతం ఓటింగ్ నమోదైంది. లోహర్దగా నియోజకవర్గం 73.21 శాతం పోలింగ్‌తో ముందంజలో ఉండగా, సెరైకెల్లా-ఖర్సావాన్ 72.19 శాతం, గుమ్లా 67.35 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి.హజారీబాగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 59.13 శాతం, రాష్ట్ర రాజధాని రాంచీలో 60.49 శాతం పోలింగ్‌ నమోదైంది. రామ్‌గఢ్‌లో 66.32 శాతం, ఖుంటి 68.36 శాతం, వెస్ట్ సింగ్‌బంలో 66.87 శాతం, లతేహర్‌లో 67.16 శాతం, గర్వాలో 67.35 శాతం, ఈస్ట్ సింగ్‌బంలో 64.87 శాతం ఓటింగ్ నమోదైంది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది, మొత్తం 81 స్థానాలకు గాను 43 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాంచీలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

Recent

- Advertisment -spot_img