Homeహైదరాబాద్latest News‘జస్టిస్ ఫర్ గీతాంజలి’

‘జస్టిస్ ఫర్ గీతాంజలి’

– ట్విట్టర్​లో ట్రెండింగ్​గా మారిన హ్యాష్ టాగ్
– ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ నెటిజన్ల ట్వీట్లు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ట్విట్టర్​లోనూ జస్టిస్​ ఫర్ గీతాంజలి హ్యాష్ ట్యాప్ ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉంది. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన‌ గీతాంజలి గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అయితే, ఇటీవల వైసీపీ నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న గీతాంజలి.. తనకు జగన్ ప్రభుత్వం ద్వారా వచ్చిన సాయం గురించి మీడియాతో ఉత్సాహంగా మాట్లాడింది. పిల్లలకు అమ్మఒడి, తనకు ఇల్లు పట్టా వచ్చినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియోలో సోషల్​ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై టీడీపీ, జనసేన పార్టీలు ట్రోల్ చేశాయి. మితిమీరిన ట్రోలింగ్ దీంతో మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు యత్నించింది. రెండ్రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చనిపోయింది. దీంతో సోషల్​ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి హ్యాష్‌టాగ్‌ వైరల్‌గా మారింది. గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు ఇప్పటికే 15 వేలకు పైగా ట్లీట్లు చేశారు.

Recent

- Advertisment -spot_img