వికారాబాద్ లగచర్ల ఘటనలో కలెక్టర్ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం సరికాదని.. దీని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు. అయితే అదే సమయంలో సామాన్యుల ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం మంచి పద్దతి కాదన్నారు. దీని వెనుక ఎవరున్నారో వారిపై కేసులు పెట్టాలన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా బాధ్యత ఉందని రేవంత్ రెడ్డి వెళ్లి సమస్య ఏంటో తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతోనే తాము ఉంటామని కిషన్ రెడ్డి తెలిపారు.