Homeక్రైంmarrige:రెండు లక్షలు కట్నం పోసిన పెళ్ళికొడుకు..అదనంగా కట్నం కావాలన్నా పెళ్లికూతురు --పెళ్లి రద్దు

marrige:రెండు లక్షలు కట్నం పోసిన పెళ్ళికొడుకు..అదనంగా కట్నం కావాలన్నా పెళ్లికూతురు –పెళ్లి రద్దు

marrige:మరి కాసేపట్లో పెళ్లి.. వివాహానికి వచ్చిన బంధువులతో వేదికంతా కోలాహలం.. అంతలోనే ఆపండి.. అనే పిలుపు.. ఇది సినిమాల్లో జరిగే పెళ్లిళ్ల్లలో వినిపించే మాట. వరుడు వధువు మెడలో తాళికట్టే సమయానికి సరిగ్గా ఈ పిలుపు వినిపిస్తుంది. అక్కడ ఎంట్రీ ఇచ్చేది వరుడి మాజీ ప్రేయసో.. పోలీసులో.. వధువు మామో ఉంటారు. తర్వాత ట్రాజడీ ఉంటుంది. కానీ.. ఇక్కడ ఆ పిలుపు ఇచ్చింది వధువు. దీంతో వరుడు షాక్‌ అయ్యాడు. ముహూర్తానికి గంట ముందు పెళ్లి వద్దని తెగేసి చెపిపంది. ఎందుకు అలా చేసిందో తెలిసి పెళ్లికి వచ్చినవారూ షాక్‌ అయ్యారు.

సాధారణంగా కట్నం విషయంలో వరుడు, అతని తల్లిదండ్రులు పట్టుబడతుంటారు. అదనపు కట్నం కోసం పెళ్లయిన తర్వాత కూడా భార్యలను వేధించే భర్తలను కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ వధువే తనకు ఇచ్చే కట్నం చాలదని పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్‌–మల్కాజిగిరి ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్ష¯Œ హాల్‌లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు.

అబ్బాయి వారు ఇచ్చే కట్నం సరిపోదని...

ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫువారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్‌ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌ కు రప్పించారు.పెళ్లికి ముందు వధువు ఇచ్చిన షాక్‌తో వరుడు, ఆమె కుటుంబ సభ్యులే కాదు.. పెళ్లికి వచ్చిన బంధువులూ షాక్‌ అయ్యారు. పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లికి ముందే వధువుల ఇలా చేస్తే.. పెళ్లి తర్వాత తమ కొడుకును ఎంత వేధిస్తుందో అని భావించిన వరుడి తల్లిదండ్రులు పెళ్లి క్యాన్సినల్‌ అనేశారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకోవడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img