పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ.. కొత్త రేషన్ కార్డుల జారీపై విధివిధానాలను ప్రభుత్వానికి అందించనుంది. ఆ వెంటనే అక్టోబరులో కొత్త రేషన్ కార్డుల జారీ కొరకు అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. తాజాగా కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందజేయనున్నారు.