భారతీయ టెలికాం రంగంలో జియో ఒక సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జియో కోటి మంది కస్టమర్లను కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే దీని ప్రభావం తమపై ఉండదు అని కంపెనీ తెలిపింది. మరోవైపు ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియాలు నష్టాన్ని కలిగిస్తూ ముఖేష్ అంబానీని కలవరపెడుతున్నాయి. దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.1999 ప్లాన్ కింద వినియోగదారులు 365 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్లు మరియు రోజుకు 100 ఉచిత SMSలను పొందుతారని ఎయిర్టెల్ ప్రకటించింది.
ఈ ప్లాన్ ప్రధానంగా ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు ఉపయోగపడుతుంది.కానీ ఎయిర్టెల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్లో మొత్తం సంవత్సర కాలానికి 24GB డేటా మాత్రమే అందించబడుతుంది. అంటే వినియోగదారులకు సగటున నెలకు 2GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇది తక్కువ మొత్తంలో డబ్బుగా అనిపించినప్పటికీ, ఇంట్లో WiFi కనెక్షన్ మరియు పని చేసే ప్రదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న వ్యక్తులకు ఈ ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎయిర్టెల్ ఈ ప్లాన్ను ప్రకటించకముందే రిలయన్స్ జియో కూడా ఇదే తరహాలో వార్షిక ప్లాన్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జియో రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటును మాత్రమే అందిస్తుంది. అయితే ఎయిర్టెల్ 365 రోజుల వ్యాలిడిటీని తీసుకొచ్చింది. జియో 1899 ప్లాన్ కింద, వినియోగదారులకు 24 GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMSలు అందించబడతాయి.