– రామిళ్ల రాధిక తీవ్ర ప్రయత్నాలు
– వివేక్ కుమారుడు కూడా ..
– ఉద్యమనేతకా? వ్యాపారవేత్త కుమారుడికా?
– హైకమాండ్ మొగ్గు ఎవరివైపు?
ఇదేనిజం, లక్షెట్టిపేట: పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అభ్యర్థుల వేట కొనసాగిస్తున్నాయి. ఇక నేతలు సైతం టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ సీటు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. రామిళ్ల రాధిక ఈ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కష్టకాలంలో పార్టీని ఆదుకున్నను కనక తనకే టికెట్ వస్తుందని ఆమె భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC GOOD NEWS
ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి తన కుమారుడికి టికెట్ ఇప్పించుకొనేందుకు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు ఎస్సీ రిజర్వ్ డ్ స్థానాలు. వీటిలో చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ధర్మపురి సెగ్మెంట్ లో అడ్లూరి లక్ష్మణ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్, వినోద్ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. అడ్లూరి లక్ష్మణ కుమార్ ది మాదిగ సామాజికవర్గం.
ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్
మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ మాల సామాజికవర్గానికి దక్కనుందా? లేక మాదిక సామాజికవర్గానికి దక్కనుందా? అన్నది ఇంట్రెస్టింగ్ మారింది. వివేక్ తన కుమారుడు వంశీకి టికెట్ ఇప్పించుకొనేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రామిళ్ల రాధిక సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. కాబట్టి.. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ సామాజికివర్గానికి చెందిన తనకే సీటు వస్తుందని ఆమె ఆశ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: ఆ పాటతోనే ప్రభుత్వం మారింది: కేటీఆర్
అయితే ఎన్నికల ముందు పార్టీలో చేరిన వివేక్ అనూహ్యంగా విజయం సాధించారు. తన సోదరుడి గెలుపు కోసం కూడా కష్టపడ్డారు. దీనికి తోడు ఆయన పెద్ద పారిశ్రామికవేత్త. సొంతంగా మీడియా సంస్థ ఉంది. కాబట్టి.. వివేక్ గట్టిగా పట్టుబడితే ఆయన కుమారుడికి కూడా టికెట్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపుగుర్రాలకే అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా బలమైన నేతలకే టికెట్లు కేటాయించింది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అయితే వివేక్ కుమారుడికి టికెట్ దక్కే చాన్స్ ఉంది. మరి ఈ స్థానం నుంచి ఎవరికి టికెట్ దక్కనుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: పాపం.. లైఫ్ లో పెద్ద తప్పు చేశానని రియలైజ్ అవుతున్న సమంత