Homeహైదరాబాద్latest News‘పెద్దపల్లి’ కాంగ్రెస్​ టికెట్​ ఎవరికి?

‘పెద్దపల్లి’ కాంగ్రెస్​ టికెట్​ ఎవరికి?

– రామిళ్ల రాధిక తీవ్ర ప్రయత్నాలు
– వివేక్​ కుమారుడు కూడా ..
– ఉద్యమనేతకా? వ్యాపారవేత్త కుమారుడికా?
– హైకమాండ్​ మొగ్గు ఎవరివైపు?

ఇదేనిజం, లక్షెట్టిపేట: పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అభ్యర్థుల వేట కొనసాగిస్తున్నాయి. ఇక నేతలు సైతం టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్​ సీటు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. రామిళ్ల రాధిక ఈ టికెట్​ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కష్టకాలంలో పార్టీని ఆదుకున్నను కనక తనకే టికెట్​ వస్తుందని ఆమె భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC GOOD NEWS

ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్​ పార్టీలో చేరిన వివేక్​ వెంకటస్వామి తన కుమారుడికి టికెట్​ ఇప్పించుకొనేందుకు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు ఎస్సీ రిజర్వ్ డ్ స్థానాలు. వీటిలో చెన్నూరులో వివేక్​, బెల్లంపల్లిలో వినోద్​ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ధర్మపురి సెగ్మెంట్​ లో అడ్లూరి లక్ష్మణ కుమార్​ ఎమ్మెల్యేగా ఉన్నారు. వివేక్​, వినోద్​ మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా.. అడ్లూరి లక్ష్మణ కుమార్​ ది మాదిగ సామాజికవర్గం.

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్

మరి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టికెట్​ మాల సామాజికవర్గానికి దక్కనుందా? లేక మాదిక సామాజికవర్గానికి దక్కనుందా? అన్నది ఇంట్రెస్టింగ్​ మారింది. వివేక్​ తన కుమారుడు వంశీకి టికెట్​ ఇప్పించుకొనేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రామిళ్ల రాధిక సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్​ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. కాబట్టి.. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో మాదిగ సామాజికివర్గానికి చెందిన తనకే సీటు వస్తుందని ఆమె ఆశ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆ పాటతోనే ప్రభుత్వం మారింది: కేటీఆర్

అయితే ఎన్నికల ముందు పార్టీలో చేరిన వివేక్​ అనూహ్యంగా విజయం సాధించారు. తన సోదరుడి గెలుపు కోసం కూడా కష్టపడ్డారు. దీనికి తోడు ఆయన పెద్ద పారిశ్రామికవేత్త. సొంతంగా మీడియా సంస్థ ఉంది. కాబట్టి.. వివేక్​ గట్టిగా పట్టుబడితే ఆయన కుమారుడికి కూడా టికెట్​ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్​ పార్టీ గెలుపుగుర్రాలకే అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా బలమైన నేతలకే టికెట్లు కేటాయించింది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్​ ఫాలో అయితే వివేక్​ కుమారుడికి టికెట్​ దక్కే చాన్స్​ ఉంది. మరి ఈ స్థానం నుంచి ఎవరికి టికెట్​ దక్కనుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: పాపం.. లైఫ్ లో పెద్ద తప్పు చేశానని రియలైజ్ అవుతున్న సమంత

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img