Homeహైదరాబాద్latest Newsపాపం.. CM రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ట్రోల్స్.. సీఎంకు ఇంగ్లిష్ రావాలా..?

పాపం.. CM రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ట్రోల్స్.. సీఎంకు ఇంగ్లిష్ రావాలా..?

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దావోస్ లో జరిగిన WORLD ECONOMIC FORUM సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే సీఎం అక్కడ మీడియాతో ఇంగ్లిష్ లో మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా ట్రోల్స్ చాలా వస్తున్నాయి.

Read More :KTR : ప్రజాపాలనలో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి

ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు

ఇంగ్లిష్ రాని వ్యక్తి సీఎం ఎలా అయ్యాడని కొందరు కామెంట్స్ చేస్తే.. చక్కగా పరిపాలన చేయడానికి బేసిక్ ఇంగ్లిష్​ ఉంటే సరిపోతుంది.. అది సీఎం రేవంత్ కు ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభిమానులైతే… కేటీఆర్, కేసీఆర్ తో పోల్చుతూ… సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

ALSO READ: తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు BRS: కేటీఆర్

కాంగ్రెస్ అభిమానులైతే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సమావేశమైన ఫోటోలు, వివిధ దేశాల ప్రతినిధులు, సీఈవోలతో జరిపిన సమావేశాల వివరాలతో ఏం సాధించారన్నది బలంగా ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల్లోనే 50 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులతో సమావేశామయ్యారని, ఆదానీ లాంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు కారకుడు అయ్యాడని చెబుతున్నారు.

ALSO READ: రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు..

Recent

- Advertisment -spot_img