Homeహైదరాబాద్latest Newsతెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు BRS: కేటీఆర్

తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు BRS: కేటీఆర్

లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని BRSకు ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(X) వేదికగా తెలిపారు. 17వ, 18వ లోక్ సభలలో ఏ పార్టీ ఎన్ని ప్రశ్నలు సంధించిందో ఈ ట్వీట్‌లో వెల్లడించారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గళాన్ని గట్టిగా, స్పష్టంగా వినిపించేది కేవలం BRS మాత్రమేనని కేటీఆర్ తెలిపారు.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

తెలంగాణ హ‌క్కులు, ప్ర‌యోజ‌నాల కోసం పార్ల‌మెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని పలుమార్లు ప్రశ్నించినట్లు తెలిపారు. గడిచిన పదేళ్లను గమనిస్తే.. BRS ఎంపీలు కేంద్రాన్ని 4,754 సార్లు ప్ర‌శ్నించ‌గా, కాంగ్రెస్ 1271 సార్లు, బీజేపీ 190 సార్లు మాత్ర‌మే ప్ర‌శ్నించిన‌ట్లు గ‌ణాంకాలను పోస్ట్ చేశారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్ర‌మేనని.. 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక BRS పార్టీ మాత్రమే అన్నారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం… తెలంగాణ దళం.. మనమే.. అని కేటీఆర్ పేర్కొన్నారు.

ALSO READ: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు.. 

Recent

- Advertisment -spot_img