వినాయకుడి నిమజ్జన సమయంలో భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు.
- వినాయకుడి విగ్రహాలను కలుషితమైన నీటిలో నిమజ్జనం చేయకూడదు.
- సూర్యాస్తమయంలోపు నిమజ్జనాన్ని పూర్తిచేయాలి.
- నిమజ్జనానికి ముందు గణేషుడికి పూజ చేయాలి. పూలమాలలతో అలంకరించి.. సింధూరంతో తిలకం దిద్దాలి.
- విగ్రహం నీటిలో పూర్తిగా మునిగేలా క్రేన్ సాయంతో కిందకు నెమ్మదిగా దించాలి.
- పొరపాటున ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమని వినాయకుడిని వేడుకోవాలి.