‘పుష్ప 1’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బాలీవుడ్ లో మాత్రం పుష్ప సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండో భాగం ద్వారా హిందీ నుంచి రూ.250 కోట్లకు పైగా వసూలు చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కానీ తెలుగులో పుష్ప 1 అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనుగోలుకు ముందు, వెనక ఆడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత ‘దేవర’ మూవీతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకి మిక్స్ డ్ రివ్యూలు వచ్చినా తారక్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ తో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అదే పని అల్లు అర్జున్ చేయగలరా? అని బయ్యర్లు సందేహిస్తున్నారు. సినిమాపై టాక్ అస్సలు ఫర్వాలేదనిపించినా… దేవర తరహాలో అల్లు అర్జున్ సినిమాను పట్టాలెక్కిస్తాడా? అనే సందేహం డిస్ట్రిబ్యూటర్లను వేధిస్తోంది. సినిమా బడ్జెట్ అంచనాలకు మించి ఖర్చు పెట్టింది చిత్రబృందం. థియేట్రికల్ రైట్స్ భారీగానే చెప్తున్నట్లు సమాచారం. ఇంతవరకు వారితో నిర్మాతలకు డీల్స్ కుదర్లేదు. డిసెంబర్ నెలలో పుష్ప సినిమాకి పోటీగా ఏ సినిమాలు లేవని, కచ్చితంగా భారీ కలెక్షన్లు రాబడుతుందని నిర్మాతలు చెబుతున్నారు. మరి బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి.