HomeసినిమాRashmika Mandanna : అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను

Rashmika Mandanna : అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను

Rashmika Mandanna : అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను.

Rashmika Mandanna : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రష్మిక చక్రం తిప్పేస్తోంది.

వరుస విజయాలతో ఆమె దూసుకుపోతోంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ .. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.

ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను పోషించిన రష్మిక, ఈ వేదికపై తనదైన శైలిలో మాట్లాడింది.

“అల్లు అర్జున్ సార్ .. నేను మీకు ఫ్యాన్ ని కాదు .. అంతకుమించి.

ఈ సినిమాలో మీరు ఎంతో అద్భుతంగా నటించారు. స్క్రీన్ పై మీ ఎనర్జీ చూస్తుంటే మాటలు రావడం లేదు.

కచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డుతో పాటు అన్ని అవార్డులు మీకు రావాలనే కోరుకుంటున్నాను. అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను.

సుకుమార్ గారి డైరెక్షన్ సూపర్ .. చింపేశారు. ఇక దేవిశ్రీ గారి పాటలు ఈ సినిమాకి హైలైట్.

ప్రతి పాట అదిరిపోయింది. ఆయన పాటల వలన మాకు దిష్టి తగులుతుందేమోనని అనిపిస్తోంది.

అందుకే నేను దిష్టి తీసుకుంటున్నాను. ఇక ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి మైత్రీ మూవీస్ వారు కారకులు.

వాళ్లకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను” అంటూ ముగించింది.

Recent

- Advertisment -spot_img