Homeహైదరాబాద్latest Newsబీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

ఇదేనిజం, మేడ్చల్: బీజేపీ రాష్ట్ర నాయకుడు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి కూన శ్రీశైలం గౌడ్ తో సీఎం ఆదేశాలు మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మైనం పల్లి హన్మంత్ రావు కూన శ్రీశైలం గౌడ్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం సీఎం నివాసంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గతంలో మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ పనిచేస్తూ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఫాలోవర్ గా ముద్ర పడ్డారు. సీఎం రేవంత్ కావడం తో మాజీ ఎమ్మెల్యే చేరిక పట్ల గత నెల రోజుల నుండి ప్రచారం జరుగుతుంది.

బీజేపీ ఎంపీ అభ్యర్థి గా మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసేందుకు కూన అధిష్టానంకు రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం కూన శ్రీశైలం గౌడ్ కు ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఈటెల రాజేందర్ కు కేటాయించింది. అప్పటినుండి కూన బీజేపీ పట్ల నారాజ్ గా ఉన్నారు. బీజేపీ లో తనకు ప్రాధాన్యత తగ్గుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో తన భవిష్యత్ పట్ల వచ్చిన సానుకూల హామీతో తిరిగి మాజీ ఎమ్మెల్యే కూన కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనతో పాటు కూన సోదరుడు కూన శ్రీనివాస్ గౌడ్, నిజాంపేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ నుండి కౌన్సిలర్ రాము గౌడ్ బీజేపీ లో చేరారు. వీరితో పాటు మరికొందరు పార్టీలో చేరినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img