SNAKES:పాములు ఆ ఊరును పగబట్టాయి .దొరికినోళ్లను దొరికినట్లు కాటేస్తున్నాయి అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ 1118 మందిని పాములు కాటేశాయి . దీంతో అక్కడి ప్రజలు పాము పేరు చెబితే గజగజ వణుకుతున్నారు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో 2022 జనవరి 1 నుంచి ఈ ఏడాది జూన్ 3 వరకు మొత్తం 1118 కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని అలీబాగ్, పన్వేల్, ఖలాపుర్, మహాద్, మంగవూన్ తాలూకాల్లో ఇవి ఎక్కువగా నమోదైనట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే పాముకాటుకు గురైన వ్యక్తులు నిర్లక్ష్యం చేయొద్దని స్థానిక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. పాముకాటుకు గురైన వెంటనే మంత్రాలు, నాటు వైద్యం పేరుతో నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లాలని అధికారులు సూచించారు. జిల్లాలో 14 ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పాముకాటు చికిత్స అందుబాటులో ఉందన్నారు.