Homeహైదరాబాద్latest Newsపండుగ పూట.. హైదరాబాదీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..?

పండుగ పూట.. హైదరాబాదీలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..?

దసరా పండుగ సందర్భంగా హైదరాబాదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరవాసులు నీటి బిల్లులు చెల్లించడం లేదని జలమండలికి పలు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెరుగుతున్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు అధికారులు చక్కటి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హెచ్‌ఎంఎస్‌ఎస్‌బీ జలమండలి కార్యదర్శి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై ఆలస్య రుసుము మరియు వడ్డీని మాఫీ చేస్తూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేయడానికి వీలుగా ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తాగునీటి బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ నెల 1 నుంచి 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా ఒక ప్రకటనలో వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img