టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఈ మధ్య యాక్టివ్‌గా ఉంటోంది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తోంది. .
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అరవింద సమేత సినిమాలో నటించి ఎంతగానో బాధపడ్డానని చెప్పింది. ఆ సినిమాలో ముందుగా చెప్పింది వేరు, తర్వాత తన క్యారెక్టర్ కి సంబంధించిన సన్నివేశాలు తీసేసి స్క్రీన్ మీద తక్కువ చూపించారని బాధపడింది.
ఈషా రెబ్బా బ్రేకప్స్, రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎవరినైనా సరే చాలా తొందరగా నమ్మేస్తాను. అందుకే చాలా మందితో ప్రేమలో పడి వారిని గుడ్డిగా నమ్మను. ఆ తర్వాత వారి గురించి పూర్తి వివరాలు తెలిసాక వదిలి పెట్టేసాను. వారితో నేను రాంగ్ రిలేషన్ చేశాను. ఎందుకంటే వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వారిని నమ్మాను’ అని చెప్పుకొచ్చింది.
‘అయితే నేను వారితో బ్రేకప్ చెప్పుకున్న సమయంలో కారణాలు చిన్నవే అయినప్పటికీ రిలేషన్ లో ఉన్నప్పుడు అవి చాలా పెద్దగా కనిపిస్తాయి. అందుకే నాకు రిలేషన్ వర్కౌట్ అవ్వలేదు. నాకు పెళ్లంటే చాలా భయం. ఎందుకంటే అది నా దృష్టిలో పెద్ద పని. ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను దాన్ని ఫేస్ చేయలేను. అందుకే పెళ్లికి ఇంకా సమయం తీసుకుంటాను. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను’ అంటూ ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.