VIJAY DEVARAKONDA:టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు 11 గంటల పాటు విచారించారు. లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలపై విజయ్ను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం విజయ్ దేవరకొండ ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. వాళ్లు రమ్మన్నారు.. నేను వెళ్లాను అని తెలిపారు. నా జీవితంలో ఇదో అనుభవం అంటూ పేర్కొన్నారు. ఈడీకి పూర్తిగా సహకరించాను. మళ్లీ రమ్మని చెప్పలేదు అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ఇటీవల పూరీ జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.