Homeఆంద్రప్రదేశ్​topudurthi prakash reddy: బాబు సీఎం కాలేడు..

topudurthi prakash reddy: బాబు సీఎం కాలేడు..

  • అయితే గుండు కొట్టించుకుంటా..
  • రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

topudurthi prakash reddy:ఇదేనిజం, ఏపీ బ్యూరో: భవిష్యత్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు గనక ముఖ్యమంత్రి అయితే తాను గుండు కొట్టించుకుంటానంటూ సవాల్ విసిరారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు .. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఆరోపణలపై తాజాగా ప్రకాశ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఓ గజదొంగ అంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు 40 వేల కోట్ల దోపిడీ కి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాయలసీమ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబుకు లేదు.. చంద్రబాబు ఏరోజైనా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించారా? ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. బాబు శిలాఫలాకాలు వేయడం తప్పిస్తే ఏం చేశారు?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రశ్నించారు.‘నీ దోపిడీలు గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతావా?. విజయ డెయిరీని చంపేసిన ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు. సహకార వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు సహకార వ్యవస్థను మేం గాడిన పెడుతున్నాం. చంద్రబాబు రైతుల రక్తాన్ని పీల్చిన రక్త పిశాచి. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ దందాగా మార్చావు. ఇళ్ల నిర్మాణం గురించి బాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు’ అని మండిపడ్డారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img