54 ఏళ్ల తరువాత ఉగాది పండగ ముందురోజు ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. కాగా ఈ ఏడాదిలో మొదటిసారి నేడు సుధీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. భారత కాలమానం ప్రకారం.. నేడు రాత్రి 9.12 గంటలకు గ్రహణం ప్రారంభమై వేకువజాము 2.22 గంటలకు వరకు కొనసాగనుంది. దీంతో ఉత్తర అమెరికా ప్రాంతం అంతా చీకటితో కప్పేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.12గం. నుంచి నాసా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.