టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ కావూరిహిల్స్‌లో అద్దెకు ఉంటున్న తన ఫ్లాట్‌లో ఉరివేసుకుంది. రాజమండ్రికి చెందిన స్వప్నకు ప్రాజెక్టులు లేక ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆమె బోళా శంకర్ సినిమాకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసింది.